ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు

by Ratna Kumari |

దిశ, బిజినేపల్లి : ఆటో ను ఆర్టీసీ బస్సు బలంగాఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.

ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు
X

దిశ, బిజినేపల్లి : ఆటో ను ఆర్టీసీ బస్సు బలంగాఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి అతివేగంగా వనపర్తి వెళ్లే క్రమంలో నాగర్ కర్నూల్ మండలం, పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే ఆటో డ్రైవర్ బిజినేపల్లి నుంచి వట్టెం వైపు వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆటో డ్రైవర్ అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ ని స్థానికులు వెంటనే 108 సాయంతో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Next Story