జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బీజేపీ బ‌రిలో : సీనియర్ నేత నాగూరావు నామాజీ

by Nallavelli.Anjaneyulu |

దిశ, నారాయణపేట ప్రతినిధి : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉంటుందని.. అబద్ధాలు మోసాలకు కాంగ్రెస్ మారుపేరుగా వర్ణించవచ్చని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బీజేపీ బ‌రిలో : సీనియర్ నేత నాగూరావు  నామాజీ
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీలో ఉంటుందని.. అబద్ధాలు మోసాలకు కాంగ్రెస్ మారుపేరుగా వర్ణించవచ్చని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత నాగూరావు నామాజీ అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి చిత్తశుద్ది లేదని జి ఓ 9 నీ కోర్టు కొట్టి వేయడంతో మరోసారి కాంగ్రెస్ మోసం బయట పడిందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అబద్ధాలతో పదవిని కాపాడుకుంటున్నారని విమర్శించారు. బిజెపి 42 శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లు కలిసి బిసిలను మోసం చేశాయన్నారు. అంతే కాకుండా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎం ఐ ఎం పోటీ చేయక పోవడంలో రెండు పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బందం ప్రజలు గమనిస్తున్నారన్నారు. హైడ్రా భయంతో ఎం ఐ ఎం పోటీ చేయడం లేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ కుటిల రాజకీయాలను గుర్తించి బుద్ది చెప్పాలని కోరారు. రతంగ్ పాండు రెడ్డి, సత్య యాదవ్, వెంకట్ రాములు, జే ఏ సీ వెంకటయ్య పాల్గొన్నారు.

Next Story