- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి ఓనర్ ఒత్తిడి కారణంగా సీనియర్ అసిస్టెంట్ నీలిమ మృతి
దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నీలిమ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

దిశ, గోపాల్ పేట : వనపర్తి జిల్లా గోపాల్ పేట మండల తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న నీలిమ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్-నీలిమ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు కలరు. పెద్దకుమారుడు ఇంటర్మీడియట్, రెండో కుమారుడు పదోతరగతి చదువుతుననారు. నీలిమ వనపర్తి జిల్లా కేంద్రంలో రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వెంగళరావు కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి ఓనర్ దగ్గర ఐదు రూపాయల వడ్డీకి 20 లక్షలు రూపాయలు అప్పుగా తీసుకొని భూమి కొన్నది. మధ్యలో మధ్యలో అప్పు 20 లక్షలు కట్టింది. ఇంకా 20 లక్షలు చెల్లించాలని ఇంటి ఓనరు ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన నీలిమ తాను నివాసం ఉంటున్న అద్దె ఇంట్లో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయింది. భర్త వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వనపర్తి రూరల్ పోలీసులు తెలిపారు.






