- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల బెడద నుండి కొల్లాపూర్ ప్రజల్ని కాపాడండి : సీపీఎం
దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మున్సిపాలిటీలో కుక్కలు, పశువులు పందుల బెడదల నుంచి ప్రజల్ని కాపాడాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం సీపీఎం

దిశ, కొల్లాపూర్ : కొల్లాపూర్ మున్సిపాలిటీలో కుక్కలు, పశువులు పందుల బెడదల నుంచి ప్రజల్ని కాపాడాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ కు శుక్రవారం సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం కొల్లాపూర్ మండల కార్యదర్శి బి. శివ వర్మ, టౌన్ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ.. కొల్లాపూర్ పట్టణంలో కుక్కలు పశువులు పందులు బెడదతో ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. వీధి కుక్కలతో చిన్నారుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వాహదారులపై కుక్కలు వెంబడించి దాడి చేస్తున్న పట్టించుకునే పరిస్థితి లేదని, పట్టణంలో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల పైన దాడి చేస్తూ కరుస్తూ ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక హాస్పిటల్ లో కనీస వైద్యం కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. ప్రజలు తమ పాణాలను గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతున్నా.. కానీ స్థానిక అధికారులు పాలకులు మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వీధి కుక్కలను పట్టణం నుంచి తరలించాలని సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా స్థానిక అధికారులు ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. పశువులు రోడ్లపైనే సంచరిస్తూ తిష్ట వేసుకొని ఉంటూ ప్రయాణికులకు బస్సులకు ఇతర వాహనాలకు తీవ్ర ఇబ్బందులు వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. వాటిని గోశాలలకు లేదా ఇతర ప్రాంతాలకు తరలించేలా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కమిషన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సాయికుమార్, సురేష్, రాజు, సంజయ్ పాల్గొన్నారు.






