మా గ్రామాలను ముంపు నుంచి కాపాడండి

by Ratna Kumari |

దిశ, చారకొండ : గోకారం-ఎర్రవెల్లి రిజర్వాయర్ ముంపు నుంచి మా ఊరును కాపాడాలని ఎర్రవెల్లి, ఎర్రవెల్లి తాండా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా

మా గ్రామాలను ముంపు నుంచి కాపాడండి
X

దిశ, చారకొండ : గోకారం-ఎర్రవెల్లి రిజర్వాయర్ ముంపు నుంచి మా ఊరును కాపాడాలని ఎర్రవెల్లి, ఎర్రవెల్లి తాండా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల బాధిత ప్రజలు మాట్లాడుతూ.. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గిస్తే ఏ రకంగానై ఇబ్బంది లేదనీ, అందుకు భిన్నంగా నీటి సామర్థ్యం పెంచి గ్రామాలను ముంపునకు గురవుతున్నా నిర్లక్ష్యం వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఆంతర్యం ఏమిటంటూ అంటూ విమర్శించారు. గతంలో కేవలం కాలువ నిర్మాణమనీ, మభ్య పెట్టే సర్వేలు చేస్తూ.. ఏ భూములు ముంపున‌కు గురికావని రెండు గ్రామాల ప్రజలను మోసపూరిత పోర్జరీ సంతకాలు, బ్యాంకు అకౌంట్ నెంబరు తీసుకుని మోసం చేశారని, తీరా నేడు రెండు గ్రామాలు ముంపున‌కు గురవుతున్న విషయం భూసేకరణ నోటిఫికేషన్ తో బాధితులను మరింత ఆవేదనకు గురిచేశారని వారు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు చాలా నిర్లక్ష్యం వహించడం లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. గతంలో రాష్ట్రంలోని కొన్ని రిజర్వాయర్ల నిర్మాణం కొనసాగుతున్న సమయంలో నీటి సామర్థ్యం తగ్గించినప్పుడు ఏ మాత్రం పనులు ప్రారంభం కానీ ఈ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గిస్తే నష్టమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది ఏళ్లుగా ఊరు ఉంటదా పోతదా అనే సందిగ్ధంలో పిల్లలు పెళ్లిలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమనీ, సమస్య పరిష్కారానికి రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు అధికారులను ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. దీక్షలో అల్వాల్ బాలయ్య, లాలూ అల్వాల చంద్రయ్య,సుగిరి వీరయ్య,అంజయ్య,రెడ్యా నాయక్,రాములయ్య, ప్రకాశ్, నాగయ్య, రెండు గ్రామాల ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

Next Story