జోగులాంబ ప్రతిష్టను కాపాడండి....!

by Ratna Kumari |

దిశ‌, అలంపూర్ : అలంపూర్ పుణ్యక్షేత్రంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వరుని ఆలయంలో టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఆలయ ప్రతిష్ట దిగజారే విధంగా

జోగులాంబ ప్రతిష్టను కాపాడండి....!
X

దిశ‌, అలంపూర్ : అలంపూర్ పుణ్యక్షేత్రంలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వరుని ఆలయంలో టెండర్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఆలయ ప్రతిష్ట దిగజారే విధంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ, ఫోటోలకు ఫోజులిచ్చి ఆలయం ముందే నిరసన, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో ఆలయ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింటుందని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరుని ఆలయాలను కాపాడాలని ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఎండోమెంట్ శైలజ రామయ్యర్ కు అలంపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు మొరపెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా పేరుగాంచిన శ్రీ జోగులాంబ , బాల బ్రహ్మేశ్వర, నవబ్రహ్మ ఆలయాలు మన నియోజకవర్గానికి ఆధ్యాత్మిక శోభను, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంటే... అలంపూర్ ఆలయంలో ఉన్న ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఆలయం ముందు నిరసన తెలపడం ఏమిటని ప్రశ్నించారు. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలవాలనే ఆలయాల ప్రతిష్టను టెండర్ల నిర్వహణలో చిన్నపాటి కూరగాయల సరఫరా అంశంలో కుల ప్రాతిపదికను తీసుకొచ్చి నిలపడంతో వివాదాస్పదానికి దారితీసిందని తెలియజేశారు. ఆలయాల గౌరవానికి నష్టం కలగడం.. ఈ చిన్నపాటి టెండర్ను మీరే స్వయంగా అలంపూర్ ఆలయాలను వీక్షించి పరిశీలించాలని కోరారు.


ఆలయంలో రోజురోజుకు జరుగుతున్న వివాదాలను ఫులిస్టాప్ పెట్టకుండా ఒక వర్గంతో కలిసి ఆలయ ఆవరణలో మీడియా సమావేశాలు పెట్టడం, టెండర్లపై పక్షపాత లేఖలు రాయడం, ఉద్యోగ నియమావళికి విరుద్ధంగా ఆలయం బయట నిరసనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ సెక్రటరీకి విన్నవించుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఒకవైపు ఆలయాలను అభివృద్ధి చేయాలని పరితపిస్తుంటే.. ఆలయంలో ఉన్న ఉద్యోగులు మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడం.. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వాదనలు చేసుకోవడంతో రాష్ట్ర మొత్తం అలంపూర్ ఆలయాల వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్టిఏ శాఖ మెంబర్లు సతీష్ రెడ్డి, మహేష్ గౌడ్, ఆలయ చైర్మన్ మాజీ డైరెక్టర్ నాగ శివమణి కోరారు.



Next Story