గ్రామ‌స్తుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు : స‌ర్పంచ్ రాములు

by Nallavelli.Anjaneyulu |

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ రాములు కొనియాడారు.

గ్రామ‌స్తుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు : స‌ర్పంచ్ రాములు
X

దిశ, మిడ్జిల్ : తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేలా ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని సర్పంచ్ రాములు కొనియాడారు. మండలంలో బుధవారం కొత్తూరు గ్రామంలో భోగి పండుగ సందర్భంగా శ్రీజ డైరీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, చిన్నారులకు పతంగుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా చక్కటి ముగ్గులు వేసి రంగులద్ది చూపరులను ఆకట్టుకున్నారు. మహిళలు సాంప్రదాయంగా చుక్కల ముగ్గులు వేసి రంగులు తో బొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. గ్రామంలో భోగి పండుగ కన్నుల విందుగా జరుపుకున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు , చిన్నారులకు బహుమతులను అందజేశారు. గ్రామస్తులకు స‌ర్పంచ్ రాములు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీజ డైరీ తెలంగాణ రాష్ట్ర ఎసీఓ యుగంధర్ రెడ్డి , ఎగ్జిక్యూటివ్ మహేష్, పాలమిత్ర గంగాధర్, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Next Story