- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు మౌలిక వసతులు తీర్చేందుకు పని చేస్తా : సర్పంచ్ రాజేంద్ర గౌడ్
ప్రజలకు మౌలిక వసతులు తీర్చేందుకు పని చేస్తానని మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు.

దిశ, మక్తల్ : ప్రజలకు మౌలిక వసతులు తీర్చేందుకు పని చేస్తానని మంథన్ గోడ్ గ్రామ సర్పంచ్ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందాలని, ప్రజలకు మౌలిక వసతులపై సలహాలు, సూచనలు ఇవ్వాలని సర్పంచ్ గా ఎన్నికై నెల రోజులు కూడా కాక ముందే శుక్రవారం రాజేంద్ర గౌడ్ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 40 సంవత్సరాలుగా సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు పదవులు పొందడానికి గ్రామస్తులే కారణమని అందుకు తమ కుటుంబం ఎప్పుడూ గ్రామస్తులకు రుణపడి ఉంటామని, వారి అడుగుజాడల్లోనే ఐదేళ్ల సర్పంచ్ పదవీని కొనసాగించే కాలంలో ప్రజల మౌలిక వసూలు తీర్చడానికి తన శాయశక్తుల ప్రభుత్వ, సొంత నిధులతో పనులు చేయిస్తానన్నారు. ఈ గ్రామసభలో పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి గ్రామంలో ఉన్న మురుగునీటి గుంతలను పూడ్చడం, రోడ్ల పై ఉన్న గుంతలను మొరం సహాయంతో పూడ్చటం, తాగునీటి సమస్య, వీధి దీపాలు ఏర్పాటు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, టీచర్ల కొరత ఇతర సౌకర్యాలు తాగునీటి కోసం స్టీల్ ట్యాంక్ ఏర్పాటు విద్యుత్ సమస్య, బాల్య వివాహాలపై అవగాహన వంటి అంశాలపై చర్చించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో నిధులు తీసుకు వచ్చి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందా మని గ్రామంలోని అక్రపక్ష నాయకులు సహకరించాలని పిలుపునిచ్చారు.






