గ్రామాభివృద్ధికి అడ్డుప‌డుతున్న స‌ర్పంచ్

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా అక్టోబర్ 2025 లో సీసీ రోడ్డు నిర్మాణం కోసం గ్రామంలోని గాంధీ చౌరస్తా నుంచి ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయి.

గ్రామాభివృద్ధికి అడ్డుప‌డుతున్న స‌ర్పంచ్
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా అక్టోబర్ 2025 లో సీసీ రోడ్డు నిర్మాణం కోసం గ్రామంలోని గాంధీ చౌరస్తా నుంచి ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులకు జనవరి 27న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమి పూజ చేశారు. అనంతరం బుధవారం పదో వార్డు మెంబర్ కాశమ్మ జేసీబీ తో డస్ట్ తొలగింపు పనులు చేస్తుండగా.. విషయం నాకు తెలవకుండా ఎలా పని చేస్తారని సర్పంచ్ రంగినేని పుష్పలత ఆగ్రహంతో పనులను అడ్డుకొని గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ గా గ్రామానికి అభివృద్ధి పనులు జరిగేలా తమ పాత్ర పోషించాల్సింది పోయి.. గ్రామాభివృద్ధికి అడ్డంకిగా మారడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వార్డ్ మెంబర్ కాశమ్మ గ్రామస్తులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. చేస్తున్న పనులను అడ్డుకోవడంతోపాటు నానా బూతు మాటలు, నోటితో చెప్పరాని విధంగా దుర్భాషలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోపణలో వాస్తవం లేదు

వార్డు మెంబర్ కాశమ్మ గ్రామస్తులు ఆరోపిస్తున్న విషయంపై బీఆర్ఎస్ సర్పంచ్ రంగినేని పుష్పలతను దిశ ఫోను ద్వారా వివరణ కోరగా తాను మాట్లాడుతూ.. నాకు తెలవకుండా ఎలా పనులు చేస్తారని, తీర్మానం కూడా చేస్తామని చెప్పినా వారి పార్టీలో అంతర్గత గొడవల కారణాలతోనే వార్డు మెంబర్ కాశమ్మతోపాటు కాంగ్రెస్ నాయకులు మహిళ అని చూడకుండా నాపైనే దాడి చేశారని తెలిపింది.

Next Story