- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్ సంతోష్
దిశ, గట్టు : మండల కేంద్రంలోని కస్తుర్భాగాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ బీ.ఎం.సంతోష్ ఉపాధ్యాయులుగా మారి మంగళవారం విద్యార్థులకు పాఠాలు బోదించారు.

దిశ, గట్టు : మండల కేంద్రంలోని కస్తుర్భాగాంధీ బాలికల విద్యాలయంలో కలెక్టర్ బీ.ఎం.సంతోష్ ఉపాధ్యాయులుగా మారి మంగళవారం విద్యార్థులకు పాఠాలు బోదించారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే పాఠాలను శ్రద్ధగా విని, అర్థం చేసుకుని క్రమశిక్షణతో కృషి చేయాలని కలెక్టర్ బీ.ఎం. సంతోష్ విద్యార్థులను ప్రేరేపించారు. మంగళవారం గట్టు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కళాశాలను కలెక్టర్ అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి, విద్యార్థులకు మానవ అభివృద్ధి సూచిక, స్థూల జాతీయోత్పత్తి, రాజ్యాంగ ప్రస్తావన, పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాలు, ఆదాయం, సమానత్వం వంటి సాంఘిక శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలను వివరంగా వివరించారు. విద్యార్థులు పాఠ్యాంశాలను అర్థం చేసుకుని సక్రమంగా చదవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలో వంద శాతం ఫలితాలను సాధించాలన్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరును స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరును సాంకేతికంగా పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను నిత్యం వినియోగించాలని అన్నారు. కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, అన్ని కంప్యూటర్లు సక్రమంగా పనిచేయాలని.. ఒక వారంలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతి రోజు పౌష్టికాహారం ఇవ్వాలని, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. వంట కోసం తాజా కూరగాయలు,నాణ్యత గల సరుకులు మాత్రమే వినియోగించాలన్నారు.వంటశాల పరిసరాలు, వంట పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, రుచికరమైన ఆహారం, వారి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.






