పారిశుధ్య కార్మికుడు సూసైడ్ కలకలం..

by Mallepaka Hamsa |

విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిమ్మ రెడ్డి పల్లి గ్రామ శివారు ప్రాంతమైన బావోజీ జాతరలో చోటు చేసుకుంది.

పారిశుధ్య కార్మికుడు సూసైడ్ కలకలం..
X

దిశ, కొత్తపల్లి: విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిమ్మ రెడ్డి పల్లి గ్రామ శివారు ప్రాంతమైన బావోజీ జాతరలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దామరిగిద్ద మండల కేంద్రానికి చెందిన నాగప్ప(36) గ్రామంలో గ్రామ పంచాయితీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడు రోజులుగా జాతరలో పారిశుధ్య పనుల్లో పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం జాతర సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.

Next Story