- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక ట్రాక్టర్లు.. అనుమతులు ఒకటి, అమలు మరొకటి..!
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ ప్రాంతంలో రాత్రి వేళల్లో కూడా ఇసుక వాహనాలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. ఈ ఇసుక రవాణా వ్యవహారం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

దిశ, అచ్చంపేట రూరల్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ ప్రాంతంలో రాత్రి వేళల్లో కూడా ఇసుక వాహనాలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. ఈ ఇసుక రవాణా వ్యవహారం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అతి వేగంతో గ్రామాలు, పట్టణ వీధుల్లో సంచరిస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి ఇసుక ట్రాక్టర్లు. వీటి వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో భయాందోళన నెలకొంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పనులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ప్రభుత్వ రంగ పథకాల కోసం ఇచ్చిన ప్రత్యేక పర్మిషన్లను కొందరు ట్రాక్టర్ యజమానులు తమ ఇష్టారీతిగా వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ అనుమతులను నిబంధనల ప్రకారం ఉపయోగించాల్సిందిపోయి, వ్యక్తిగత లాభాల కోసం వినియోగిస్తూ గాలికి వదిలేస్తున్నారని పట్టణవాసులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చింది ప్రజల అవసరాల కోసమే.. కానీ జరుగుతున్నది మాత్రం ఎవరి లాభం కోసం అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పర్మిషన్లు జారీ చేసిన అధికారులు వాటి అమలు, పర్యవేక్షణపై దృష్టి సారించాల్సిందిపోయి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. రాత్రివేళల్లో నియంత్రణ లేకుండా ఇసుక రవాణా కొనసాగడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం, పర్మిషన్ల దుర్వినియోగం కలిసి వచ్చి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. వెంటనే సంబంధిత శాఖలు స్పందించి, పర్మిషన్ల దుర్వినియోగంపై దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ప్రాణ భద్రత, ప్రభుత్వ నిబంధనల పరిరక్షణ కోసం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు.






