వ‌న‌పర్తికి కేంద్రీయ విద్యాల‌యం మంజూరు : ఎమ్మెల్యే మేఘా రెడ్డి

by Ratna Kumari |   (  Updated:2025-10-01 15:41:31  IST  )

దిశ‌, వ‌న‌ప‌ర్తి : వ‌న‌ప‌ర్తికి కేంద్రీయ విద్యాల‌యం మంజూరు అయింద‌ని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. బుధవారం కేంద్ర క్యాబినెట్

వ‌న‌పర్తికి కేంద్రీయ విద్యాల‌యం మంజూరు : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి : వ‌న‌ప‌ర్తికి కేంద్రీయ విద్యాల‌యం మంజూరు అయింద‌ని వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తెలిపారు. బుధవారం కేంద్ర క్యాబినెట్ వనపర్తికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో ఎమ్మెల్యే మేఘా రెడ్డి వ‌న‌ప‌ర్తికి కేంద్రీయ విద్యాల‌యం మంజూరు కావ‌డం హ‌ర్షించ ద‌గ్గ విష‌యం అని తెలిపారు. తాను చేసిన విజ్ఞప్తి కి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వానికి చొరవ చూపిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇందుకు సహకరించిన ఇన్ చార్జీ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లురవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిల‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story