- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు పదార్థాల క్రయవిక్రయాలు చట్టవిరుద్ధం : సీఐ ఇజాజోద్దీన్
మత్తు పదార్థాల వినియోగం, క్రయ విక్రయాలు, నిల్వ, రవాణా లాంటివి చట్ట విరుద్ధమని మహబూబ్ నగర్ పట్టణ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మత్తు పదార్థాల వినియోగం, క్రయ విక్రయాలు, నిల్వ, రవాణా లాంటివి చట్ట విరుద్ధమని మహబూబ్ నగర్ పట్టణ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ అన్నారు. ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలం 'రుద్ర' సహాయంతో ఆయన విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి టొబాకో ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు విక్రయించరాదని పాన్ షాప్, కిరాణం యజమానులకు ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని అన్నారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని, ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.






