బాలికల భద్రత పోలీస్ శాఖ బాధ్యత : ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉంచటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ జానకి అన్నారు. స్కూల్, కళాశాలల నుండి సమీప గ్రామాలకు

బాలికల భద్రత పోలీస్ శాఖ బాధ్యత :  ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బాలికలు, మహిళలు ఎక్కడ ఉన్నా భద్రతగా ఉంచటం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఎస్పీ జానకి అన్నారు. స్కూల్, కళాశాలల నుండి సమీప గ్రామాలకు బస్సులో వెళ్లే బాలికలు, మహిళలకు ఎవరైనా, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అని తెలుసుకునేందుకు ఎస్పీ జానకి సాదా దుస్తుల్లో, సెక్యూరిటీ మంది మార్బలం లేకుండా ప్రయాణికురాలి మాదిరి మహిళా ప్రయాణికుల మధ్య కూర్చుని వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బస్ స్టాండ్ లో వేచి ఉన్న బాలికలతో, మహిళలతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ, మీకు ఎవరి నుండైనా వేదింపులు, అసౌకర్యం, అనుమానాస్పద ప్రవర్తన వంటి సమస్యలను ఎదుర్కోంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మీలో ధైర్యం ఉండాలని, ఎలాంటి సమయంలోనైనా మీకు అందుబాటులో ఉంటామని, తప్పు చేస్తున్న వారి మీద చర్య తీసుకోవడానికి మీ సమాచారమే ఆధారమని, మీ భద్రత కోసం బస్ స్టాండ్, స్కూల్స్, కాలేజీలు, రోడ్డు, పబ్లిక్ ఏరియాల్లో పోలీస్ పర్యవేక్షణ ఉంటుందని ధైర్యం చెప్పారు. ఎవరి వల్లనైనా వేదింపులు, ఇబ్బందులు, అసురక్షితంగా అనిపించినా వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని, లేదా షీ టీం నెంబర్ 8712659365 కు కాల్ చేయాలని, ఎల్లవేళలా షీ టీం మీకు అందుబాటులో ఉంటుందని ఆమె భరోసా కల్పించారు. ఆమెకు దూరంగా మఫ్టీలో ఉమెన్స్ పీఎస్ సీఐ శ్రీనివాసులు, షీ టీం ఏహెచ్టీయూ, సురక్ష కళా బృందాలు ఉన్నారు.

Next Story