గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

by Ratna Kumari |

దిశ, నాగిరెడ్డిపేట్ : గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా చదువుతోపాటు క్రీడల్లో రాణించి, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గోపాల్ పేట్ జిల్లా పరిషత్

గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
X

దిశ, నాగిరెడ్డిపేట్ : గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా చదువుతోపాటు క్రీడల్లో రాణించి, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సబ్బాత్ కృష్ణ అన్నారు. రాష్ట్రస్థాయిలో కబడ్డీ, షాట్ పుట్, నెట్ బాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంగళవారం మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయ దంపతులు సబ్బాత్ కృష్ణ, మీరా తాయి లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మండలంలోని చీనూర్ గ్రామానికి చెందిన సిహెచ్ మౌనిక, జి మనోహర్ లు మండల కేంద్రంలోని గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. కాగా మౌనిక గత యేడాది రాష్ట్రస్థాయిలో కబడ్డీ, షాట్ పుట్ లో ప్రతిభ కనబరచగా, జి మనోహర్ రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడల్లో పాల్గొని సిల్వర్ పతకము సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సభాత్ కృష్ణ, ఆయన భార్య మీరతాయి లు గ్రామస్తులతో కలిసి చీనూర్ గ్రామంలో ఈ ఇద్దరు విద్యార్థులను సన్మానించారు. విద్యార్థులను తమ తల్లిదండ్రులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, చదువు మాన్పించి పనులకు పంపించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఓంకృష్ణ, కిషన్, క్రిష్ణ, హన్మండ్లు, నారాయణ , అంజయ్య, సాయిలు, విద్యార్థుల తల్లిదండ్రులు రవి, సుజాత, సాయిలు పాల్గొన్నారు.

Next Story