ఆర్టీసీ బస్ కండక్టర్‌కు గుండెపోటు.. 108 సిబ్బంది చాకచక్యం

by Ratna Kumari |

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం మధ్యాహ్నం అపశ్రుతి చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్ కండక్టర్‌కు గుండెపోటు.. 108 సిబ్బంది చాకచక్యం
X

దిశ, మహమ్మదాబాద్/గండీడ్ : మహబూబ్ నగర్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో బుధవారం మధ్యాహ్నం అపశ్రుతి చోటుచేసుకుంది. బస్సులో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ సురేష్‌కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి గేట్ సమీపానికి చేరుకోగానే ఆయన అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ప్రయాణికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది కండక్టర్ సురేష్‌కు ప్రథమ చికిత్స అందించి హుటాహుటిన మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన 108 సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

Next Story