ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

by Ratna Kumari |

దిశ, హన్వాడ : ఆర్టీసీ బస్సు ఢీ కొని విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన హన్వాడ మండలం చిన్న దర్పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్నదర్పల్లి గ్రామానికి చెందిన సుజాత తన కుమారుడు

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, హన్వాడ : ఆర్టీసీ బస్సు ఢీ కొని విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన హన్వాడ మండలం చిన్న దర్పల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు చిన్నదర్పల్లి గ్రామానికి చెందిన సుజాత తన కుమారుడు రామకృష్ణ ( 8 ) శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో స్కూలుకు తీసుకు వెళ్ళడం కొరకు రోడ్డు దాటుతుండగా మహబూబ్ నగర్ నుంచి పరిగి వైపు వెళుతున్న పరిగి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రామకృష్ణ అనే విద్యార్థిని ఢీ కొట్టడంతో విద్యార్థికి రెండు కాళ్ళకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 కు ఫోన్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి భాష పైలెట్ మాస్ లు వారిని మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు పంపించారు.

Next Story