వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : చ‌క్ర‌వ‌ర్తి వేణు గోపాల్

by Ratna Kumari |

దిశ, నారాయణపేట ప్రతినిధి : వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని సంస్కార భారతి ప్రాంత సహకార దర్శి చక్రవర్తి వేణుగోపాల్ అన్నారు. జిల్లా

వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం : చ‌క్ర‌వ‌ర్తి వేణు గోపాల్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని సంస్కార భారతి ప్రాంత సహకార దర్శి చక్రవర్తి వేణుగోపాల్ అన్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పథ సంచలన్ కార్యక్రమాన్ని పళ్ళ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమై సరాఫ్ బజార్, మెయిన్ చౌక్, సుభాష్ రోడ్, వీర సావర్కర్ చౌరస్తా సత్యనారాయణ చౌరస్తా బస్టాండ్ మీదుగా గార్డెన్ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. ముందుగా ప్రార్థనతో పథ సంచలన్ ప్రారంభించారు. శ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘము పెంపొందిస్తుందని పేర్కొన్నారు.


హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పథ సంచలన్ పాల్గొన్న స్వయం సేవకులకు నారాయణపేట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మెయిన్ చౌక్ వద్ద అలాగే భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో సత్యనారాయణ చౌరస్తాలో పూలతో స్వాగతం పలికారు. అలాగే పలువురు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు స్వయం సేవకులకు పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి సరోదే, నగర సంఘ చాలక్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి తో పాటు స్వయం సేవకులు పాల్గొన్నారు.

Next Story