ఆర్ఎస్ఎస్ దేశాన్ని హిందూ దేశంగా చేయాలనే యోచిస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నారాయణస్వామి

by Nallavelli.Anjaneyulu |

దిశ, జడ్చర్ల : ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలని ఆలోచిస్తుందని ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారని క‌ర్ణాట‌క ఎమ్మెల్సీ నారాయ‌ణ స్వామి ఆర్ఎస్ఎస్

ఆర్ఎస్ఎస్ దేశాన్ని హిందూ దేశంగా చేయాలనే యోచిస్తుంది.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నారాయణస్వామి
X

దిశ, జడ్చర్ల : ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని హిందూ దేశంగా చేయాలని ఆలోచిస్తుందని ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారని క‌ర్ణాట‌క ఎమ్మెల్సీ నారాయ‌ణ స్వామి ఆర్ఎస్ఎస్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం అభిప్రాయ సేకరణలో నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఏ సమస్య అయినా.. ఎవరైనా ఓ ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాలంటే ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని కానీ ఆర్ఎస్ఎస్ సంఘం వాళ్లు మాత్రం అలాంటివి తీసుకోకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ మైదానాల్లో ప్రభుత్వ పాఠశాలలో ర్యాలీలు సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే కర్ణాటక రాష్ట్ర మంత్రి మల్లికార్జున ఖ‌ర్గే కుమారుడు రాష్ట్ర సీఎంకి ఒక లేఖ రాశారని ఇక ముందు ఆర్ఎస్ఎస్ వాళ్లు అయి, ఏ సంస్త వాళ్లైనా సరే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ విద్యాలయాల్లో సభలు సమావేశాలు ర్యాలీ నిర్వహించాలంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని జీవో తయారుచేసి చట్టం చేయాలని ముఖ్యమంత్రి కి లేఖ రాసిన‌ట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్యాబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని.. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాల‌ని ఎక్క‌డ ప్ర‌స్తావించ‌లేద‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం వారికి న‌చ్చ‌క‌నే ఆర్ఎస్ఎస్ అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ దుష్ప్ర‌చారం చేస్తుంద‌ని.. వారు చేసిన ఆరోప‌ణ‌లు వాస్త‌వం లేద‌ని ఎమ్మెల్సీ నారాయ‌ణ‌స్వామి వెల్ల‌డించారు.

Next Story