- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
దిశ, మల్దకల్ : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు మల్దకల్ మండల కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచాలన్ కార్యక్రమం చేపట్టారు. స్వయంభుః లక్ష్మీ

దిశ, మల్దకల్ : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు మల్దకల్ మండల కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదసంచాలన్ కార్యక్రమం చేపట్టారు. స్వయంభుః లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర ప్రారంభమై మల్దకల్ పురవీధులు దశమికట్ట, పాత యూనియన్ బ్యాంకు, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ గుండా సాగి తిమ్మప్ప స్వామి గుడి వద్దకు చేరుకుంది. అనంతరం ఎస్ఎల్వీ పంక్షన్ హాల్ నిర్వహించిన బహిరంగ సభలో విభాగ్ శారీరక్ ప్రముఖ్ భోగరాజు రాము మాట్లాడారు. దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని తెలిపారు. 1925 లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తరిత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పని చేస్తుందని చెప్పారు.
హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తానని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయం పరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటికి జాగరణ చేపట్టబోతుందని తెలిపారు. దేశ అభివృద్ధి కొరకు పంచ పరివర్తనా విషయాలు అయిన సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, స్వదేశీ - స్వాభిమానం, పౌర విధుల ఆధారంగా స్వయంసేవకులు సంఘ కార్యాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. దేశం కోసం, ధర్మం కోసం కంకణ బద్దులై పని చేస్తూ భారత దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టేలా ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే భావన అందరిలో కలిగించాలని, కలసి పని చేసి ఉదారతను చాటుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.






