- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గువ్వల బాలరాజుకు ఆర్ఎస్పీ స్ట్రాంగ్ కౌంటర్.. వెన్నుపోటు, గోడ మీది పిల్లి అంటూ..
: అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి

దిశ, అచ్చంపేట : అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీమానా చేసిన నేపథ్యంలో శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు హాజరై మాట్లాడారు.
అచ్చంపేట కార్యకర్తలకు పాదాభివందనం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఒక నాయకుడు పోవడం, రావడం సహజమైనప్పటికీ ఆ నాయకుడితో పార్టీ కేడర్ వెళ్లకుండా పార్టీ కోసం నిలబడిన తీరు చూస్తే పాదాభివందనం, సెల్యూట్ చేయాలనిపిస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. త్వరలోనే శిక్షణ శిబిరాలు ఉంటాయని, మాజీ మంత్రులందరం మీ అచ్చంపేటకు అండగా నిలబడతామన్నారు. అవసరమైతే ఒక్కొక్క మండలాన్ని ఒకరం బాధ్యత తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేసుకుంటాం అన్నారు.
వెన్నుపోటు, గోడ మీది పిల్లిలాగా ఉన్నవారికి హెచ్చరిక : ఆర్ఎస్పీ
కేసీఆర్ వదిలిన ఏ బానమైన ప్రజల కోసం పనిచేసే వారిగా ఉండాలి కానీ వెన్నుపోటు దారులుగా, గోడమీది పిల్లిలాగా ఉన్నవారికి అచ్చంపేట కార్యకర్తలు యూనిటిగా ఉండి గట్టి హెచ్చరిక చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బాలరాజు ఈ పరిస్థితుల్లో పార్టీని వదలడం బాధాకరమైనప్పటికీ కష్టకాలంలో నిలబడ్డ నాయకుడే అసలైన పార్టీ జెండా మోసే నాయకుడని అన్నారు. బాలరాజు అలా కాకుండా అస్త్ర సన్యాసం చేసి పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడూ కూడా అచ్చంపేట కావాలని ఆలోచన చేయలేదని, పార్టీ నాకు ఎంపీగా పోటీ చేయమంటే చేశానే తప్ప, నాపై తప్పుడు ఆరోపణలు చేయడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ పనితీరుపై, అవినీతిపై పోరాటం చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉండాల్సింది పోయి పార్టీలు మారడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కాళేశ్వరాన్ని బాంబులతో పేల్చి కూలేశ్వరం ప్రాజెక్టు అని ఈ ప్రభుత్వం నాటకమాడుతుందని విమర్శించారు.
20 నెలల్లో రాష్ట్రం గోసపడుతుంది : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బాలరాజు పార్టీని వీడుతారని అనుకోలేదని, ఆయన వ్యక్తిగత విషయాలను జోలికి వెళ్లదలచుకోలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్‌ను దేవునిలాగా భావిస్తూ రాష్ట్ర ప్రజలు ఆయన మళ్లీ తిరిగి సీఎం కావాలని ఆశిస్తున్న తరుణంలో ఈ పరిస్థితులు నెలకొనడం కొంత బాధ అయినప్పటికీ ఈ ప్రాంతవాసులు పార్టీకి అండగా నిలబడుతూ నాయకులతో పోకుండా ఉన్న తీరు రాష్ట్రం అంతా మీ వైపు చూసేలా చేసిందన్నారు. 20 సంవత్సరాల పాటు మీతో ఉన్న నాయకుడు మిమ్ములను విడిచి పోతున్నా మా జెండా ఎజెండా కేసీఆర్ అని కార్యకర్తలు నిలబడిన తీరు అదుర్స్ అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
ఈనెల 28 లోపు కేటీఆర్ బహిరంగ సభ
ఈనెల 28 లోపు అచ్చంపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఉంటుందని, దానికి కేటీఆర్ హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. అచ్చంపేట నల్లమల్ల ప్రాంతానికి చెందిన పార్టీ కార్యకర్తలుచ నాయకులు నిలబడిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందన్నారు. ఈ సమావేశం లో మాజీ ఎమ్మెల్యేలు బీరం వర్షం వర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అభిలాష్, పార్టీ సీనియర్ నాయకులు పోకల మనోహర్, నరసింహ గౌడ్, తులసి రామ్, శ్రీకాంత్ బీమా, గోపాల్ నాయక్, నరేందర్ రావు, గణేష్ రావు, భూపాల్ రెడ్డి, భగవంతు, అమినోదీన్, రమేష్ రావు, కేటి తిరుపతయ్య, కట్ట గోపాల్ రెడ్డి, శ్రీరామ్ నాయక్, శ్రీనివాసులు, పదర బక్కయ్య, భారతి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






