గురుకులాల బ‌లోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు

by Ratna Kumari |

గురుకులాల బ‌లోపేతానికి రూ.10.65 కోట్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన‌ట్టు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గం లోని పలు విద్యాసంస్థల బలోపేతంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్టు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

గురుకులాల బ‌లోపేతానికి రూ.10.65 కోట్లు మంజూరు
X

దిశ‌, ఖిల్లాఘ‌నాపురం : గురుకులాల బ‌లోపేతానికి రూ.10.65 కోట్ల‌ను సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేసిన‌ట్టు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గం లోని పలు విద్యాసంస్థల బలోపేతంపై ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్టు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఖిల్లా ఘణపురం మండల బాలుర ఆశ్రమ పాఠశాల లో డార్మెటరీ డైనింగ్ హాల్ నిర్మాణాలకు రూ.2 కోట్లు మంజూరు, వనపర్తి మండలం మర్రికుంట లోని బాలికల గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో డైనింగ్ హాల్, వంట గదుల నిర్మాణానికి రూ 1.50 కోట్లు.. మర్రికుంట బాలికల గిరిజన గురుకుల పాఠశాల అధ్యాపక నివాస సముదాయ (Staff quarters) నిర్మాణానికి రూ 1.50 కోట్లు మంజూరు అయిన‌ట్టు తెలిపారు. అలాగే పెద్దమందడి మండలం బుగ్గపల్లి తాండ రాజపేట శివారులోని బాలుర గిరిజన గురుకుల పాఠశాల లో డైనింగ్ హాల్ మరియు అధ్యాపక నివాస సముదాయ భవన నిర్మాణాలకు సంబంధించి రూ. 3 కోట్లు, అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహ నిర్మాణానికి 2.65 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పనుల ప్రారంభానికి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నాయని ఈ భవన నిర్మాణాలతో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని విద్యాసంస్థలన్నీ బలోపేతం అవుతాయని MLA మెగారెడ్డి వెల్ల‌డించారు.

Next Story