44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్ర‌మాదం..ఒక‌రు మృతి

by velandi.Saikiran |

44వ జాతీయ రహదారిపై వేగంగా కంటైనర్ ను స్కార్పియో వాహనం ఢీ కొట్టిన‌ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన

44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్ర‌మాదం..ఒక‌రు మృతి
X

దిశ, జడ్చర్ల : 44వ జాతీయ రహదారిపై వేగంగా కంటైనర్ ను స్కార్పియో వాహనం ఢీ కొట్టిన‌ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై జయప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... కొంపల్లికి చెందిన రోహిత్ తో పాటు మరో ఇద్దరు స్కార్పియో వాహనంలో కొడైకెనాల్ నుండి హైదరాబాద్ వెళుతున్నారు.

ఈ త‌రుణంలోనే... జడ్చర్లలోని ఫ్లైఓవర్ పై కంటైనర్ ను స్కార్పియో వాహనం వేగంగా ఢీకొనడంతో రోహిత్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని, మృతుడు రోహిత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై వివ‌రించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పడుతున్నామని ఎస్సై తెలిపారు.

Next Story