మ‌హ‌మ్మ‌దాబాద్ లో రోడ్డు ప్ర‌మాదం.. భార్య‌, భ‌ర్త‌ల‌కు గాయాలు

by Ratna Kumari |

మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

మ‌హ‌మ్మ‌దాబాద్ లో రోడ్డు ప్ర‌మాదం..  భార్య‌, భ‌ర్త‌ల‌కు గాయాలు
X

దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో గుర్తుతెలియని బొలెరో వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పాయపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ (30) తన భార్య సుజాతతో కలిసి బైక్ పై మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మహమ్మదాబాద్ ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర వేగంగా వచ్చిన గుర్తుతెలియని బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిపాల్ కుడి చేయి విరిగింది. భార్య సుజాతకు కుడి చేతికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) జానమ్మ, పైలట్ అక్బర్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స అందించారు. వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Next Story