- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన రిక్కి తేజ
మే 16న నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా, వంగూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాల (యూపీఎస్) విద్యార్థి రిక్కి తేజ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు.

దిశ, వంగూర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 16న నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా, వంగూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో ఉన్నత ప్రాథమిక పాఠశాల (యూపీఎస్) విద్యార్థి రిక్కి తేజ జూనియర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న విద్యార్థుల మధ్య జరిగిన ఈ పోటీలలో తన సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యం, వినూత్న ఆలోచనలతో రూపొందించిన కళాఖండం ద్వారా రిక్కి తేజ న్యాయనిర్ణే తల ప్రశంసలను అందుకొని అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయం ద్వారా తుమ్మలపల్లి పాఠశాలకు, వంగూరు మండలానికి, నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, రిక్కి తేజను ప్రశంసాపత్రం మొమెం టో తో సత్కరించి అభినం దించారు.
విద్యార్థి సాధించిన విజయాన్ని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. రిక్కి తేజ విజయం పై పాఠశాల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, పాఠశాల అందించిన మార్గదర్శకత ఈ విజయా నికి ప్రధాన కారణాలని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతి నిధులు, విద్యావేత్తలు, గ్రామ పెద్దలు రిక్కి తేజను అభినందిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా సరైన అవకాశాలు కల్పిస్తే రాష్ట్రస్థాయి లో ప్రతిభ చాటగలరని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి జిల్లాకు కీర్తి తెచ్చిన రిక్కి తేజ భవిష్యత్తు లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో నూతన ప్రతిభను చాటాలని, అభినందిస్తూ డిఇఓ రమేష్ కుమార్ ఆకాంక్షిస్తున్నారు.






