- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 8న పాలమూరు జిల్లా ప్రాజెక్ట్ లపై సమీక్ష
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఈనెల 8న (ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఈనెల 8న (ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్, కోయిల్ సాగర్, జూరాల, మక్తల్-నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల పరిస్థితులపై సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story






