- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి : మంత్రి వాకిటి శ్రీహరి
అచ్చంపేట ప్రాంతంలో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ నిర్మాణం కోసం రూ 50 కోట్లు మంజూరు చేస్తున్నానని మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిట శ్రీహరి ప్రకటించారు.

దిశ, అచ్చంపేట : అచ్చంపేట ప్రాంతంలో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ నిర్మాణం కోసం రూ 50 కోట్లు మంజూరు చేస్తున్నానని మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిట శ్రీహరి ప్రకటించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి భూమిపూజ శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు. అనంతరం అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామం వద్ద ఉన్న జిల్లా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం వద్ద జిల్లాలోని ముదిరాజులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గడిచిన 75 ఏళ్ల స్వతంత్ర దేశంలో రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉందని కాకి లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు కానీ దానిని నిజం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి జనగణ రాష్ట్రంలో చేపట్టిన తర్వాత ముదిరాజుల ప్రాధాన్యతను వారి ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేలా ముదిరాజు బిడ్డకు సముచిత స్థానం కల్పించారని అందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ముదిరాజులకు మంత్రి పదవీ ఇచ్చిన ఏకైక సీఎం..
ఇప్పటివరకు అనేక ప్రభుత్వాలు మారుతూ వచ్చినప్పటికీ కూడా.. సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజులకు మంత్రి పదవి తోపాటు అన్ని శాఖల తో పాటు ముదిరాజ్ శాఖ కూడా చైర్మన్ పదవి ఇచ్చింది ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని మంత్రి కొనియాడారు. కావున మన స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వము మీ బిడ్డగా నేనున్నానని అందుకు మన పిల్లలను ఉన్నత విద్యకు చదివించేందుకు అన్ని శాఖల సహకారాలు అందజేస్తానని అలాగే పిల్లలను చదివించండి పెద్దలు ఆర్థిక వృద్ధి పొందేందుకు పని చేయాలని సూచించారు.
అచ్చంపేటలో ఆక్వా కల్చర్ సెంటర్ కు 50 కోట్లు..
రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఆక్వా కల్చర్ సెంటర్ ను అచ్చంపేట ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కావలసిన స్థలాన్ని దాదాపు 100 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. అలాగే చంద్ర సాగర్ వద్ద ప్రస్తుత నూతన టెక్నాలజీతో రూ. 50 లక్షలతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసేందుకు ఇక్కడి నుంచి మంజూరు చేస్తున్నానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అలాగే వైయస్సార్ పార్కుకు మరో రెండు కోట్లు, మినీ రాజు ఎన్టీఆర్ స్టేడియం కి నిధులు, అచ్చంపేట పాల ఉత్పత్తి కేంద్రానికి మరో 30 వేల లీటర్ల చిల్లింగ్ చేసే యంత్రాన్ని మంజూరు చేస్తున్నానని రానున్న బడ్జెట్లో రెండు నుండి మూడు వేల కోట్లు కేటాయించేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
88 కోట్ల చేప పిల్లను దిగుమతి..
ప్రతి ఏడాది రాష్ట్రంలో అన్ని చెరువులు కుంటలలో చేప పిల్లలను వదిలేందుకు 88 కోట్ల చేప పిల్లలను ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వాటికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలోనే చేప పిల్లల ఉత్పత్తిని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా నేనున్నానని విషయాన్ని మర్చిపోవద్దని రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేలా అంతర్జాతీయ స్థాయిలో ముదిరాజుల వృత్తిని మరింత వృద్ధి చెందేలా అన్ని రకాల సహకారాలు అందజేస్తామని అందుకు పిల్లలను చదివించాలని పదే పదే మంత్రి ముదిరాజులను కోరారు.
డిండి ప్రాజెక్టులో మత్స్య శాఖకు ప్రాథమిక కల్పించాలి : ఎమ్మెల్యే వంశీ కృష్ణ
డిండి ప్రాజెక్టులో జిల్లాతో పాటు అత్యధికంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న ముదిరాజులకు అధిక ప్రాథమిక కల్పించేలా చర్యలు తీసుకోవాలని, చంద్ర సాగర్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని, మక్తల్ నియోజకవర్గం లో మత్సశాఖ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయిస్తున్నారో అచ్చంపేట కూడా అలాగే నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో ఉన్న ముదిరాజులకు ఆర్థిక వెసులుబాటును పొందేలా చూడాలని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచించిన విధంగా అన్ని రకాల సహకారం అందజేస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డిఓ యాదగిరి, జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, డైరెక్టర్లు నరసింహ, నరేష్, నాయకులు కాశన్న యాదవ్, నిరంజన్ ముదిరాజ్, మాజీ ఎంపీపీ పర్వతాలు, వెంకటయ్య ముదిరాజ్ ఉన్నారు.






