సెల‌వు రోజుల్లో పాఠ‌శాల బ‌య‌టే రేవ‌ల్లి కేజీబీవీ విద్యార్థినులు

by Ratna Kumari |

రేవల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్తినిలు సెలవు దినాల్లో తమ యోగ క్షేమాలు తెలుసుకొని చూసేందుకు కలిసేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, తల్లి దండ్రులు పాఠశాల బయటికి వెళ్లి కలవాల్సిన పరిస్థితి నెలకొంది.

సెల‌వు రోజుల్లో పాఠ‌శాల బ‌య‌టే రేవ‌ల్లి కేజీబీవీ విద్యార్థినులు
X

దిశ‌, రేవ‌ల్లి : మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్తినిలు సెలవు దినాల్లో తమ యోగ క్షేమాలు తెలుసుకొని చూసేందుకు కలిసేందుకు వచ్చిన కుటుంబసభ్యులు, తల్లి దండ్రులు పాఠశాల బయటికి వెళ్లి కలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సెలవు దినాల్లో చెట్ల కిందికి పాఠశాల విద్యార్థులు అనేలా త‌యారైంది. పాఠశాలలోని విద్యార్థినుల పరిస్థితి, గత రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ పాఠశాలను దాదాపు 5.6 ఎకరాలలో విస్తీర్ణంలో మూడంతస్తులలో 25 గదులతో అన్ని హంగులు సదుపాయాలను సమకూర్చి నాలుగు కోట్ల 87 లక్షల రూపాయలను వెచ్చించి ఈ పాఠశాలలను ఏర్పాటు నిర్మాణం చేసి ప్రారంభించారు. విద్యార్థుల యోగా క్షేమాలు తెలుసుకునేందుకు వ‌చ్చిన వారి తల్లిదండ్రులు సెలవుదినాల్లో వస్తుంటారు వారిని కలిసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విజిటర్ రూమ్ / ఆఫీస్ రూమ్లలోనో,టీచర్ లేదా వార్డెన్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాటు చేయాలి.

కానీ రేవల్లి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV)లో అంతకు భిన్నంగా తల్లితో పాటు తండ్రి వస్తున్నాడని తండ్రి పురుషుడు కావున పాఠశాలలోకి అనుమతి లేదని, మరియు గదులు లేవనే సాకుతో పాఠశాల ప్రాంగణంలో అనుమతించకుండా విద్యార్థినుల భద్రత క్షేమాన్ని గాలికి వదిలి బయటకు పంపిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రులు దూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను చూసేందుకు పాఠశాలకు వస్తే, వారిని పాఠశాల లోపల కలిసేలా ఏర్పాట్లు చేయకుండా నిర్వహణ సిబ్బంది బయటకు పంపుతున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించినచో తమ పిల్లలను కలవకుండా ఇక్కడి సిబ్బంది వేధింపులకు గురి చేస్తుంటారని తెలిసింది, ఎండ తీవ్రత ఉన్నప్పటికీ విద్యార్థినులు వారి తల్లిదండ్రులు సమీపంలోని రేవల్లి రైతు వేదిక గోడనీడలోనే తపిల్లలతో మాట్లాడుకోవడం.. తమ కుమార్తెలకు అక్కడే జడలు వేస్తూ, ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం తినిపిస్తూ కనిపించింది.

ఇది చూసినవారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రభుత్వం బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలో కనీసం తల్లిదండ్రులు- విద్యార్థినులను కలిసేందుకు సరైన స్థలం కల్పించకపోవడం తగదని సువిశాలమైన పాఠశాలలో స్థలం లేకపోవడం ఏంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన సందర్శకుల గది లేదా నీడ ఉన్న ప్రదేశం ఏర్పాటు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవని.. ఎండలో బయట నిలబడి పిల్లలతో మాట్లాడుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాల ప్రాంగణంలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను కలుసుకునే విధంగా సరైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు, విద్యార్థుల‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story