దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. రైతుల‌కు స‌రిప‌డా యూరియా అందుబాటులోకి..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-27 11:29:52  IST  )

మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి మణిచందర్ అన్నారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. రైతుల‌కు స‌రిప‌డా యూరియా అందుబాటులోకి..!
X

దిశ‌, పాన్ గ‌ల్ : మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఆందోళన చెందవద్దని మండల వ్యవసాయ అధికారి మణిచందర్ అన్నారు. మంగళవారం దిశ దినపత్రికలో వచ్చిన క్యూ లైన్ లో నిలబడి రొట్టెలు తిని వార్తకు స్పందించారు. రైతు వేదిక వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు రైతు వేదిక భవనంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కావాల్సిన మండలానికి సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని సూచించారు. రైతులు యూరియా కోసం వచ్చి ఇబ్బందులకు గురి కావద్దన్నారు. వ్యవసాయ పనులను వదులుకొని యూరియా కోసం పడి కాపులు కాయాల్సిన అవసరం లేదన్నారు. మండలానికి సరిపడినంత యూరియా రోజువారీగా యూరియాను నిరంతరం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

Next Story