- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ కథనానికి స్పందన.. అబ్కారి పంపకాల పంచాయితీ పై విచారణ షురూ
దిశ- మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎక్సైజ్ శాఖలో పంపకాల పంచాయితీ అనే కథనం పై అబ్కారి అధికారులు సైతం స్పందించారు. మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్

దిశ- మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ ఎక్సైజ్ శాఖలో పంపకాల పంచాయితీ అనే కథనం పై అబ్కారి అధికారులు సైతం స్పందించారు. మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ విచారణకు ఆదేశించారు. నూతన వైన్ షాప్ వద్ద ల మాముళ్ళ వ్యవహారం లో అర్బన్, రూరల్ అధికారి వాదనలకు దిగిన విషయం బయటకు పోక్కడంతో మహబూబ్‌నగర్ ఎక్సైజ్ కార్యాలయం లో అధికారులు అంతా ఓకరి పై ఓక్కరు గుర్రుగా ఉంటు ఎడ మొఖం పెడ మొఖం గా విధులు నిర్వహిస్తున్నారు.ఈ వ్యవహారం అంతా గత వారం రోజుల నుంచి సాగుతున్న దిశ పత్రికలో స్పష్టమైన కథనం ప్రచురితం అవ్వడంతో అబ్కారి ఉన్నత అధికారులు సైతం విచారణకు అదేశించినట్లు తెలుస్తుంది. ఎక్సైజ్ అధికారుల తీరుపై ఆశాఖ మంత్రి జూపల్లిని కలువనున్నారు నూతన వైన్ షాప్ ల లబ్ది దారులు. మహబూబ్ నగర్ అర్బన్, రూరల్ అబ్కారి అధికారుల తీరుపై నూతన వైన్ షాప్ లబ్ధిదారులు మంత్రి గారిని కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. వీరిని ఇలాగే విధుల్లో కొనసాగిస్తే ఇబ్బందులు ఉంటాయని వీరి ఇరువురిని ఇక్కడి నుంచి తొలగించాల్సి బాహటంగా ఆరోపణలకు దిగుతున్నారు.






