దిశ కథనానికి స్పందన.. మూతపడ్డ అంగన్ వాడి ఓపెన్

by Ratna Kumari |

దిశ క‌థ‌నానికి స్పంద‌న ల‌భించింది. గ‌త ఐదు నెల‌లుగా మూత‌ప‌డిన అంగ‌న్ వాడి సెంట‌ర్ దిశ క‌థ‌నంతో ఓపెన్ అయింది.

దిశ కథనానికి స్పందన..  మూతపడ్డ అంగన్ వాడి ఓపెన్
X

దిశ, వంగూర్ : “ఐదు నెలలుగా అంగన్ వాడి మూత“ అనే శీర్షిక మార్చి 10న మంగళవారం దిశ దినపత్రికలో ప్రచురితమైంది. దీని పై సంబంధిత శాఖ అధికారులు స్పందించి మండల పరిధిలోని వేలమలపల్లి గ్రామంలో బుధవారం అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. అయితే ఇక్కడ పని చేస్తున్న అంగన్ వాడి టీచర్ శ్రీకుమారి కి మండల కేంద్రం సెంటర్ కు చార్జ్ గా బాధ్యతలు అప్పగించడంతో రెగ్యులర్ గా అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసే దిశగా ప్రయత్నం కొనసాగిస్తామని ఆమె తెలిపారు. ఇన్ చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంగన్ వాడీ టీచర్ శ్రీకుమారి చిన్నారులు 10, గర్భిణీలు బాలింతలు18, ఏడు నుంచి 3 సంవత్సరాల పిల్లలు 32 మందికి అందాల్సిన పౌష్టికాహార సరుకులు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దిశ క‌థ‌నం ద్వారా మూత‌పడ్డ అంగన్వాడీ కేంద్రం తెరవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story