'దిశ' క‌థ‌నానికి స్పంద‌న‌.. ర‌చ్చ బండ‌పై చ‌ర్చ

by Ratna Kumari |

దిశ‌, కొల్లాపూర్ : దిశ దిన ప‌త్రిక‌లో ఈనెల 06న జిల్లా టాబ్లెయిడ్ లో 'ఆఖ‌రి మ‌జిలీకి అవ‌స్థ‌లు అనే క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దిశ లో ప్ర‌చురిత‌మైన ఈ

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. ర‌చ్చ బండ‌పై చ‌ర్చ
X

దిశ‌, కొల్లాపూర్ : దిశ దిన ప‌త్రిక‌లో ఈనెల 06న జిల్లా టాబ్లెయిడ్ లో 'ఆఖ‌రి మ‌జిలీకి అవ‌స్థ‌లు అనే క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. దిశ లో ప్ర‌చురిత‌మైన ఈ క‌థ‌నానికి ప్ర‌జ‌ల్లో మంచి స్పంద‌న ల‌భించింది. నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూర్ గ్రామంలోని రచ్చ బండ పై మంగళవారం గ్రామస్థులు పెద్ద ఎత్తున చర్చ పెట్టి రచ్చ.. రచ్చ చేశారు. గ్రామం నుంచి శవాన్ని బొందలగడ్డకు దారి లేక వాగు నీటిలోనే వెళ్ళాల్సిన పరిస్థితి. వైకుంఠ దామానికి మధ్యలో ఉన్న పసుల వాగు వరద ప్రవాహంలో నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలు దాటాల్సిన కన్నీటి గోసను గూర్చి 'దిశ, దినపత్రిక వెలుగులోకి తెచ్చింది.

గ్రామస్థులు 'దిశ, దినపత్రిక కి అభినందనలు తెలిపారు. అయితే ఇదే వాగు పై వంతెన నిర్మాణం కోసం రూ,2.60 కోట్ల తో గతంలో శిలాఫలకం వేసిన విషయం విధితమే. వంతెన నిర్మాణానికి రాజకీయ నాయకులు పాలకులపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని పలువురు యువకులు విమర్శలు చేశారు. ఇదే వార్త పై ప్రజలు గ్రామ రచ్చ బండ పై కూర్చుకొని దీనంతటికి కారకులు రాజకీయ నాయకులేనని గట్టిగా నిందించారు. చేతకాని నాయకులు ఏ మొఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతారని యువకులు ప్రశ్నించడం కోసమేరుపు. ఏది ఏమైనాప్పటికీ ప్రజలను సంఘటితం చేసి రచ్చ బండ పై చర్చకు తెరలేపిన 'దిశ, దిన పత్రిక యాజమాన్యానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story