- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వృద్ధులను గౌరవించటం మనందరి బాధ్యత : కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వృద్ధులను గౌరవించటం మనందరం బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా శనివారం స్టే

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వృద్ధులను గౌరవించటం మనందరం బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాలలో భాగంగా శనివారం స్టేడియం గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వృద్ధుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై నిర్వహించిన 'అవగాహన ర్యాలీ' ని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించి ప్రసంగించారు. వృద్ధుల పట్ల గౌరవంగా, దయతో వ్యవహరించాలని, వారి అవసరాలను అర్థం చేసుకోవాలని, వారి మానసిక స్థితిని గ్రహించి మసలుకోవాలన్నారు. ముదిమి వయసులో తల్లిదండ్రులను విడదీయ్యకుండా, వారిని పంచుకోవాలనే ఆలోచనలను రానీవ్వకండని హితవు పలికారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద వృద్ధుల పట్ల వ్యవహరించాల్సిన ప్రవర్తనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర, జిల్లా సంక్షేమ అధికారిణి జరీనా బేగం, అదనపు ఎస్పీ ఎన్బీ రత్నం, డిఎంహెచ్ఓ కృష్ణ, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, రాజసింహుడు, కోటిరెడ్డి, నాగేంద్రస్వామి, సూర్యనారాయణ పాల్గొన్నారు.






