వ్యాపారం కోసం షెడ్లు నిర్మించాలని ఎమ్మెల్సీకి విన‌తి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కంద‌నూల్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోని ప్ర‌ధాన రోడ్డుపై వ్యాపారం కోసం షెడ్లు నిర్మించి ఇవ్వాల‌ని వ్యాపార‌స్తులు ఎమ్మెల్సీ కూచ‌కుళ్ల

వ్యాపారం కోసం షెడ్లు నిర్మించాలని ఎమ్మెల్సీకి విన‌తి
X

దిశ‌, కంద‌నూల్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోని ప్ర‌ధాన రోడ్డుపై వ్యాపారం కోసం షెడ్లు నిర్మించి ఇవ్వాల‌ని వ్యాపార‌స్తులు ఎమ్మెల్సీ కూచ‌కుళ్ల దామోద‌ర్ రెడ్డికి విన‌తి పత్రం అంద‌జేశారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పొదిల రామయ్య, యాదగిరి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నా, స్థిరమైన వ్యాపారం లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు పడుతూ జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జూనియర్ కాలేజీ గేట్ ముందు 32 షెడ్లు నిర్మించి పేదలకు బ్రతకడానికి అవకాశం కల్పించారని తెలిపారు. ఈ ప్రభుత్వ హయాంలో కూడా అంబేద్కర్ చౌరస్తాలో వీధి వ్యాపారాలు చేసుకోవడానికి డ్రైనేజీ ఎత్తు తగ్గించి వాటి పైన చిన్న చిన్న షెడ్లు నిర్మిస్తే వారు బ్రతకడానికి జీవించడానికి మార్గం చూపిన వారుగా ఎప్పటికీ జిల్లా చరిత్రలో నిలిచిపోతారని కోరారు. పేదవారి షెడ్లు నిర్మించాలని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ.. మురుగు కాలువ ఎత్తు తగ్గించి వ్యాపారాలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీధి వ్యాపారులు యాదగిరి, మురళి పాల్గొన్నారు.

Next Story