ఆర్థికంగా నేరాలు జ‌రిగితే 1930 కి స‌మాచారం ఇవ్వండి : ఎస్సై ర‌మేష్

by Ratna Kumari |

దిశ, నర్వ : ఆర్థికంగా నేరాలు జ‌రిగితే 1930 కి స‌మాచారం ఇవ్వాల‌ని ఎస్సై ర‌మేష్ సూచించారు. న‌ర్వ మండల కేంద్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఎస్ఐఆర్డి స్వచ్ఛంద సేవ కొత్తకోట సంస్థ ఆధ్వర్యంలో

ఆర్థికంగా నేరాలు జ‌రిగితే 1930 కి స‌మాచారం ఇవ్వండి : ఎస్సై ర‌మేష్
X

దిశ, నర్వ : ఆర్థికంగా నేరాలు జ‌రిగితే 1930 కి స‌మాచారం ఇవ్వాల‌ని ఎస్సై ర‌మేష్ సూచించారు. న‌ర్వ మండల కేంద్రంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఎస్ఐఆర్డి స్వచ్ఛంద సేవ కొత్తకోట సంస్థ ఆధ్వర్యంలో మండల మహిళా సమాఖ్య ఆర్బిఐ వర్క్ షాప్ ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వ‌హించారు. ఆర్థిక అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా నర్వ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ బ్యాంకుల పనితీరు బ్యాంక్ అందిస్తున్న సేవలు కస్టమర్లకు ఏ విధంగా ప్రయోజ‌నం జరుగుతుందో ప్రధానమంత్రి సామాజిక ఇన్సూరెన్స్ పథకాలను ఉపయోగించుకోవాలని వివరించారు .అలాగే బ్యాంక్ సేవ కస్టమర్లకు అందుతున్న ప్రయోజనాలు అనగా సామాజిక ఇన్సూరెన్స్ పథకాల అట్టాల్ పెన్షన్ యోజన అభివృద్ధి యోజన క్లోజ్ అయిన పాత ఖాతాల నుంచి ఫండ్ ను పునరుద్దరించి ఎవరి డబ్బులు వాళ్లకు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నర్వ ఎస్సై పబ్బతి రమేష్ మాట్లాడుతూ ఆర్థికంగా నేరాలు జరిగే విధానం జరగకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకవేళ జరిగితే 1930కు వెంటనే సమాచారం ఇచ్చి తమ డబ్బులను రాబట్టుకోవాలని తెలియజేశారు. ఈ బ్యాంక్స్ సేవలపై డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ సౌండ్ కింద శిక్షణ ఇవ్వడానికి శశికళ రెడ్డి, శివుడు కళాజాత బృందం నారాయణ సంపూర్ణ ఆర్థిక అక్షరాస్య అవగాహన శిక్షను ఇఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం చంద్రశేఖర్. ఎంపీడీవో శ్రీనివాసులు, నర్వ ఎస్సై పబ్బతి రమేష్, పంచాయతీ సెక్రెటరీ బుచ్చిరెడ్డి, నర్వ మండల సమైక్య అధ్యక్షులు కవిత కార్యదర్శి, సంతోషమ్మ మహిళా సంఘాల సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Next Story