- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిమాండ్ ఖైదీ పరార్..!
దిశ, కల్వకుర్తి : విచారణ కోసమై తీసుకొచ్చిన ఖైదీ పోలీస్ స్టేషన్ నుంచి పరారైనా ఘటన కల్వకుర్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... పలు దొంగతనాల కేసుల్లో నాగిరెడ్డి నిందితుడు. అంతర్ రాష్ట్ర దొంగగా

దిశ, కల్వకుర్తి : విచారణ కోసమై తీసుకొచ్చిన ఖైదీ పోలీస్ స్టేషన్ నుంచి పరారైనా ఘటన కల్వకుర్తిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... పలు దొంగతనాల కేసుల్లో నాగిరెడ్డి నిందితుడు. అంతర్ రాష్ట్ర దొంగగా పెరుగాంచిన నాగిరెడ్డి కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయ్యి అనంతపురం జిల్లా జైలు లో రిమాండ్ కాబడ్డాడు. గతంలో ఈ నిందితుడు కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీల్లో దొంగతనాలు చేశాడు. విచారణ నిమిత్తమై ఇతన్ని కల్వకుర్తి పోలీసులు రెండ్రోజుల క్రిందట తీసుకొచ్చారనీ సమాచారం. అదే క్రమంలో గురువారం రాత్రి బాత్రూం వెళ్లాలని అడగటంతో నిందితుడిని వదిలారు. అదే అదనుగా చూసుకున్న దొంగ కిటికీలోంచి దూకి పరారయ్యాడు. పోరిపోయిన ఖైదీ కోసం పోలీసులు రెండ్రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఖైదీ కు సంబంధించి నేర చరిత్ర వివరాలు తెలియాల్సి ఉంది. వివరాల కోసం పోలీస్ అధికారికి కాల్ చేయగా అందుబాటులోకి రాలేదు.






