రిమాండ్ అయిన జూనియ‌ర్ అసిస్టెంట్ పై చ‌ర్య‌లేవి..?

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-04 14:24:33  IST  )

దిశ, జడ్చర్ల : సహచర ఉద్యోగి అయిన వెలుగొమ్ముల గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశ్రీ ని లైంగిక వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు కారణంగా ప్రధానంగా ఆరోపణలు

రిమాండ్ అయిన జూనియ‌ర్ అసిస్టెంట్ పై చ‌ర్య‌లేవి..?
X

దిశ, జడ్చర్ల : సహచర ఉద్యోగి అయిన వెలుగొమ్ముల గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజశ్రీ ని లైంగిక వేధించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు కారణంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిడ్జిల్ మండల ఎంపీడీవో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రవణ్ పై జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు తరలించి 48 గంటలు దాటినా కూడా జూనియర్ అసిస్టెంట్ శ్రావ‌ణ్ పై శాఖ పరమైన చర్యలు లేకపోవడంతో పలు అనుమాలకు తావిస్తోంది. చట్టపరంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎఫ్ఐఆర్ నమోదు అయి రిమాండ్ కు వెళ్తే రిమాండ్ అయిన 24 గంటల్లో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి. కానీ మిడ్జిల్ మండల ఎంపీడీవో కార్యాల జూనియర్ అసిస్టెంట్ తన సహచర ఉద్యోగి ఆత్మహత్య కేసులో రిమాండ్ అయినా కూడా సంబంధిత జిల్లా అధికారులు ఇప్పటివరకు కూడా సస్పెన్షన్ వేటు వేయకపోవడం గమనార్థం. నిందితుడైన శ్రావణ్ తన పై సస్పెన్షన్ వేటు వేయకుండా తన కుటుంబ సభ్యులు రాజకీయ నాయకులతో ఏమైనా లాభం నడుపుతున్నాడా లేక అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారా..? జూనియర్ అసిస్టెంట్ పై శాఖపరమైన చర్యలు లేకపోవడంతో సహచార ఉద్యోగులతో పాటు మండల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికైనా రిమాండ్ అయిన శ్రావణ్ పై శాఖ పరమైన చర్యలు తీసుకొని పంచాయతీ ఆత్మహత్యకు పాల్పడ్డ సెక్రెటరీ రాజాశ్రీ కి న్యాయం చేయాలని రాజశ్రీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు

Next Story