- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల సొంతింటి కల సాకారం : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల దశాబ్దాల నాటి సొంతింటి కల నెరవేరుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

దిశ, కే.టీ.దొడ్డి : ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల దశాబ్దాల నాటి సొంతింటి కల నెరవేరుతోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని నర్సమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటికే 2000 పైగా ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో విడతల వారీగా రూ. 5 లక్షలు జమ చేస్తోందని, నిధుల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రెండో విడతలో ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, మండల అధ్యక్షులు ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.






