- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపటి నుంచి 16 వరకు రాయల గండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాలు
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతం అమ్రాబాద్ పదరా మండలాల సరిహద్దున మద్దిమడుగు ప్రధాన రహదారిలో ప్రకృతి రమణీయత మధ్య ఉన్న రాయల గండి ఎత్తైన కొండపై వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతం అమ్రాబాద్ పదరా మండలాల సరిహద్దున మద్దిమడుగు ప్రధాన రహదారిలో ప్రకృతి రమణీయత మధ్య ఉన్న రాయల గండి ఎత్తైన కొండపై వెలసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర, బ్రహ్మోత్సవాలు 13 నుంచి 16 తారీకు వరకు నిర్వహించనున్నారు. ఈ జాతర వేడుకలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పంచమి రోజు సూర్యకిరణాలు మూలవిరాట్ పాదాలపై పడడం ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు సుఖసంపదలు ప్రాప్తిస్తాయని ప్రజల విశ్వాసం.
ఆలయ చరిత్ర...
రాయల గండి చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీస్తుశకం 1536 సెప్టెంబర్ 11న చింతగుండ రంగారావు నిర్మించాలని తెలుస్తుంది. తన తండ్రి రంగారావు పేరుమీద ఈ ప్రాంతానికి రంగా రాయుని గండిగా నామకరణం చేయడంతో క్రమక్రమంగా రాయల గండిగా ప్రసిద్ధి చెందుతూ భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రూ. 61 లక్షలు తన నిధులు మంజూరు చేయడంతో ఆ నిధులతో భక్తుల సౌకర్యార్థం ఆలయం పైకి సిసి రోడ్లు, విద్యుత్ లైట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
నిర్వహించు కార్యక్రమాలు..
రాయల గండి లక్ష్మి చెన్నకేశవ స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా 13న సాయంత్రం 6 గంటలకు పదర మండలం చిట్లగుంట గ్రామం నుండి ఉత్సవ విగ్రహాలను ఆటపాటలు కోలాటాలతో ఊరేగింపుగా ఆలయానికి గురువారం తెల్లవారుజామున చేరుకుంటాయి. ధ్వజస్తంభ ఏర్పాటు, 14న లక్ష్మీ చెన్నకేశవ స్వామి కళ్యాణం మహోత్సవం, 15న అమ్రాబాద్ పదర మండలాలలో ఉన్న వివిధ గ్రామాల నుంచి బ్రహ్మోత్సవాల రాక, సంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా లోక కళ్యాణ కోసం కన్నుల పండుగగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ఇమ్మడి నరహరి, దేవాదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు..
జాతర వేడుకల సందర్భంగా ఆలయ దిగువ ప్రాంతంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. లక్ష నగదు నిర్వాహకులు అందజేస్తారు. వీటితోపాటు కోలాటం, భజన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
హాజరుకానున్న మంత్రులు..
శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మరి కొంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు సమాచారం. కళ్యాణం తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. అందుకు జాతర వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.






