- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జోరుగా కొనసాగుతున్న రేషన్ బియ్యం దందా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదల సన్నబియ్యం ఉప్పునుంతల మండలంలో సన్నాసుల పాలు అవుతుందని మండల ప్రజలు మండిపడుతున్నారు.

దిశ, ఉప్పునుంతల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదల సన్నబియ్యం ఉప్పునుంతల మండలంలో సన్నాసుల పాలు అవుతుందని మండల ప్రజలు మండిపడుతున్నారు. డైరెక్ట్ రేషన్ షాప్ డీలర్లే లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ.18కి కొనుగోళ్లు చేసి దళారులకు రూ. 25 కి అమ్ముతున్నట్టు బహిరంగ చర్చలు కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామంలో బియ్యం దందా చేసే వ్యాపారులు కూడా ప్రతీ ఇల్లు తిరుగుతూ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సోమవారం రాత్రి ఉప్పునుంతల మండల కేంద్రంలోని మర్రిపల్లి రోడ్డు ప్రధాన కూడలి వద్ద ఉన్న ఓ కిరాణం షాపు నుంచి బహిరంగంగా రేషన్ బియ్యం తరలిస్తూ దిశ కెమెరాకు చిక్కారు. అయితే ఈ విషయంపై జిల్లా సివిల్ సప్లై, అచ్చంపేట సివిల్ సప్లై అధికారులను వివరణ కోరడానికి ప్రయత్నిస్తే వారు అందుబాటులోకి రాలేదు. వివరణ కోసం ప్రయత్నం చేస్తేనే స్పందించని అధికారులు అత్యవసరానికి ఏం స్పందిస్తారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.






