కొల్లాపూర్ లో అరుదైన శస్త్ర చికిత్స‌.. గర్భ సంచిలో 3.5 కిలోల గడ్డ తొలగింపు

by Ratna Kumari |

నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలో ప్రశాంతి న‌ర్సింగ్ హోమ్ లో గురువారం రాత్రి అరుదైన హిస్ట‌రెక్ట‌మీ శస్త్ర చికిత్స చేశారు.

కొల్లాపూర్ లో అరుదైన శస్త్ర చికిత్స‌.. గర్భ సంచిలో 3.5 కిలోల గడ్డ తొలగింపు
X

దిశ, కొల్లాపూర్ : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప‌ట్ట‌ణంలో ప్రశాంతి న‌ర్సింగ్ హోమ్ లో గురువారం రాత్రి అరుదైన హిస్ట‌రెక్ట‌మీ శస్త్ర చికిత్స చేశారు. ఈ చికిత్స లో ఓ మ‌హిళా గ‌ర్భ సంచి నుంచి 3.5 కిలోల గ‌డ్డ‌ను తొల‌గించారు. 37 సంవ‌త్స‌రాల ఓ మ‌హిళాకు గ‌త 6 నెల‌ల నుంచి త‌రుచూ తీవ్ర క‌డుపునొప్పి నెల‌స‌రి అధిక ర‌క్త‌స్రావంతో బాధ ప‌డుతూ వ‌స్తోంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా గ‌ర్భ‌సంచిలో పెద్ద గ‌డ్డ ఉంద‌ని స్త్రీ వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ ప్రేమ స్వ‌రూప తెలిపారు. మందులతో చికిత్సలో మార్పు రాలేదు. బాధ ఎక్కువ కావడంతో శస్త్రచికిత్స ద్వారా 3.5 కేజీల గర్భసంచి రి సర్జరీ చేసి గురువారం రాత్రి తొలగించారు. నిపుణులైన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రేమ స్వరూప, అనస్థీషియా డాక్టర్ గౌతమ్, డాక్టర్ హిమ కుమారి, హాస్పిటల్ యాజమాన్యం పేషెంట్ కు శస్త్రచికిత్స చేసి గర్భసంచి లోనుంచి గడ్డను శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.

Next Story