వైభవంగా రామకొండ శ్రీరాముడికి పూజలు

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని రామకొండపై వెలసిన శ్రీరాముడిని ద‌ర్శించుకునేందుకు ఆదివారం అమావాస్య సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

వైభవంగా రామకొండ శ్రీరాముడికి పూజలు
X

దిశ, కోయిలకొండ : మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని రామకొండపై వెలసిన శ్రీరాముడిని ద‌ర్శించుకునేందుకు ఆదివారం అమావాస్య సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. త్రేతాయుగంలో రాముడు వనవాసానికి వెళ్లేటప్పుడు ఈ కొండమీద కాలు మోపి వెళ్ళాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలిక ఇక్కడ పడిందని నానుడి. దీంతో ఈ గుట్ట మీద నుంచి వనమూలికలు ఇంటికి తీసుకుపోతే శుభం జరుగుతుందని భక్తుల అపార నమ్మకం. ఆదివారం ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు రెండు లక్షలకి పైగా భక్తులు వచ్చారని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ భక్తులకు మూత్రశాలలు, మరుగుదొడ్లతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయలేక పోయారని భక్తులు పెదవి విరుస్తున్నారు.

Next Story