- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తహశీల్దార్ కార్యాలయం పనుల్లో నాణ్యత పాటించాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
తహశీల్దార్ కార్యాలయం పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయాల పనులను పరిశీలించారు.

దిశ, రేవల్లి : తహశీల్దార్ కార్యాలయం పనుల్లో నాణ్యత పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహశీల్దార్ కార్యాలయాల పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏదుల, రేవల్లి మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాలను నూతనంగా నిర్మించిన భవనాలకు షిఫ్ట్ చేసి, అక్కడ నుంచే ప్రజలకు సేవలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు అందేలా నూతన కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. రేవల్లి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి అంతర్గత సీసీ రోడ్డు, ప్రజలు నిలువు స్థలం, నీటి వసతి పూర్తి చేయాలని తహశీల్దార్ సరస్వతి వినతి మేరకు పంచాయతీరాజ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేవల్లి తహశీల్దార్ సరస్వతి, ఏదుల తహశీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐలు పవన్, శంకర్, సిబ్బంది రాజేష్, భరత్ పాల్గొన్నారు.






