- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ప్రజాప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం
-జిల్లా ఆస్పత్రిలో ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ఏ ర్పాటుకు నిధులు మంజూరు
-శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే సహించం
-ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎన్నో సంవత్సరాలుగా అందుబాటులో లేని ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్, ఇన్సుట్రుమెంట్స్ కోసం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకువెళ్ళగా 18 కోట్ల 76 లక్షల 80 వేల రూపాయలు మంజూరు చేస్తూ జీఓ కాపీని పంపించారని ఆయన తెలిపారు. గత 20 నెలలుగా విద్యపైన దృష్టి పెట్టామని, విద్య ఎంతో ప్రాధాన్యత రంగమని ప్రజల్లో కూడా అవగాహన కల్పించడంలో సఫలీకృతమయ్యామని అన్నారు. ఇక నియోజకవర్గంలో వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే పేద ప్రజలకు నిజాయితీతో, చిత్తశుద్ధితో నాణ్యమైన వైద్యం అందించాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు.
రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ ఎంపి డికె అరుణ తో కలిసి డిల్లీలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న ను కలిసి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరామని తెలిపారు. జిల్లా కేంద్రంలో టిడి గుట్ట, తిమ్మసాన్ పల్లి, బోయపల్లి గేట్ రైల్వే గేటు వద్ద రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జీ లను వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు, ఈ విషయంలో ఎంపి, కేంద్రమంత్రి ని ఎప్పటికప్పుడు కలిసి ఫాలో అప్ చేస్తానని ఆయన తెలిపారు. రాజకీయ నాయకులు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గం లో అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా అధికారుల పైన దౌర్జన్యం చేసినా, వారిపైన దుర్భాషలాడిన సహించేది లేదని, ఇది మన మహబూబ్ నగర్ సంస్కృతి కాదని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులు పైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నారు. శాంతియుతంగా ఉన్న మహబూబ్ నగరం లో శాంతికి విచ్ఛిన్నం కలిగించే వ్యక్తులు ఎవరైనా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తే చట్టం తన పని తాను చేసుకోబోతుందని అన్నారు. ఇట్టి విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, సీజే బెనహర్, గంజి ఆంజనేయులు, సతీష్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా పాషా, రాషెద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.






