- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెవుల్లో పువ్వులు పెడుతున్నరు.. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
దిశ, కందనూల్ : బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. 42 శాతం

దిశ, కందనూల్ : బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ సాధించలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నదని రిజర్వేషన్ అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. బిజెపి, బిఆర్ఎస్ రెండూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని.. వారు ధర్నా చేసే హక్కు లేదన్నారు. ప్రజలు ఈ పార్టీలను ప్రజా కోర్టులో నిలబెడతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విధంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. 42 శాతం రిజర్వేషన్ కు చట్ట బద్ధత కల్పించుకునేందుకు పోరాటం చేయాల్సి ఉన్నదన్నారు.






