- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
రాజాపూర్ మండలంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ లు రాజాపూర్, చిన్నవెల్లి గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించి ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు.

దిశ, రాజపూర్ : రాజాపూర్ మండలంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రవి నాయక్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ లు రాజాపూర్, చిన్నవెల్లి గ్రామాలలో పీఏసీఎస్, ఐకేపీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను గురువారం సందర్శించి ధాన్యం నిల్వలు, రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే సమీపంలోని రైస్ మిల్లులకు తరలించే చర్యల్లో భాగంగా ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపించారు. ఇక ఇదే సమయంలో రవాణా కాంట్రాక్టర్‌తో ఫోన్ ద్వారా మాట్లాడిన అధికారులు అదనపు లారీలను అత్యవసరంగా ఏర్పాటు చేసి, ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని ఆదేశించారు.
అలాగే కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న మొత్తం ధాన్యాన్ని వచ్చే మూడు రోజులలో పూర్తి స్థాయిలో తరలించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత కొనుగోలు కేంద్రాల ఏజెన్సీలకు స్పష్టమైన సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు రవాణా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.






