విద్యుత్ శాఖ ప్రజాబాట

by Ratna Kumari |

దిశ, కందనూల్ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ నాగర్ కర్నూల్ జిల్లా

విద్యుత్ శాఖ ప్రజాబాట
X

దిశ, కందనూల్ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఈ నరసింహారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ, డీఈ, ఎస్ఈలు స్వయంగా ప్రజాబాట కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు వినియోగదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి, విద్యుత్ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను స్వీకరించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. పలు ప్రాంతాల్లో సంరక్షణ, మరమ్మత్తు పనులు తక్షణమే చేపడతామన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవడమే ప్రజాబాట లక్ష్యమన్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యుత్ సేవల మెరుగుదలకు వినియోగదారులు తమ సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.

Next Story