బస్సు సౌకర్యం కల్పించండి.. మొర‌పెట్టుకున్న గిరిజ‌న‌వాసులు

by Ratna Kumari |

వ‌న‌ప‌ర్తి మండ‌ల ప‌రిధిలోని కాశీంన‌గ‌ర్, చుట్టు ప‌క్క‌ల తండాలైన నాగ‌మ్మ‌తాండ‌, కందిరీయ తండా, ఎర్రమన్ను గుట్ట తాండ నందిమల్లగడ్డ, గోకం గడ్డ, హమ్యతాండ, మేక్య తాండ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గిరిజన వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సు సౌకర్యం కల్పించండి.. మొర‌పెట్టుకున్న గిరిజ‌న‌వాసులు
X

దిశ‌, వ‌న‌ప‌ర్తి రూరల్ : వ‌న‌ప‌ర్తి మండ‌ల ప‌రిధిలోని కాశీంన‌గ‌ర్, చుట్టు ప‌క్క‌ల తండాలైన నాగ‌మ్మ‌తాండ‌, కందిరీయ తండా, ఎర్రమన్ను గుట్ట తాండ నందిమల్లగడ్డ, గోకం గడ్డ, హమ్యతాండ, మేక్య తాండ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గిరిజన వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వనపర్తి డీఎం దేవేందర్ గౌడ్ కు బస్సు సౌకర్యం కల్పించాలని బుధవారం వినతి పత్రం అందజేశారు. మా ప్రాంతాల నుంచి ప్రతినిత్యం చదువుకోవడానికి విద్యార్థులు వనపర్తికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా కాలినడకన పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందుతున్నాయి కానీ మా కాశీంనగర్ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన మా పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తే మా పిల్లలు చదువుకోవడానికి అనువుగా ఉంటుందని వారు కోరారు. గ్రామంలోని ప్రజలకు వృద్ధులకు అనారోగ్యానికి గురి అవుతే వనపర్తికి వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గిరిజనవాసులు తెలిపారు. వనపర్తికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకు రవాణా సౌకర్యం లేకపోవడం మా ప్రాంతం వెనుకబడే ఉందని ప్రజలు కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాశీంనగర్ మీదుగా రేమద్దుల వరకు ఆర్టీసీ బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని వారు డీఎం ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్, నాగమ్మ తాండ సర్పంచ్ గోవిందు నాయక్ ,హనుమంతు నాయక్, వనపర్తి ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ,మాజీ జెడ్పిటిసి ధర్మానాయక్ పాల్గొన్నారు.

Next Story