- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత : నగరపాలక మేయర్ మమత
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మహబూబ్ నగర్ నగర పాలక మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని మహబూబ్ నగర్ నగర పాలక మేయర్ మమత శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీచర్స్ కాలనీ రామాలయంలో తెలంగాణ బీసీ మహాసభ మహిళా విభాగం, శ్రీ విద్యాలక్ష్మి సరస్వతి మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ పొందిన చిన్నారుల శాస్త్రీయ నృత్యాలతో పిల్లల్లో ఆరోగ్యం, ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు.
సంగీత, నృత్య కళలను అభ్యసిస్తున్న విద్యార్థులను, కళాకారులను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొంటూ, నిర్వాహకులు ప్రతిపాదించిన సంగీత, నృత్య పాఠశాల ప్రారంభానికి తనవంతు సహకారం, ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమ్మర్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కుమ్మరి రామచంద్రయ్య, కందమూరి బ్రహ్మయ్య, సిద్ది రామయ్య, మైత్రి యాదయ్య, మెట్టుకాడి శ్యామ్, పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత, రమాదేవి, సంధ్య పాల్గొన్నారు.






